ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా వైసీపీ
YCP | ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగో రౌండ్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 17,385 ఓట్ల మెజారీటి వచ్చింది. ఇప్పటివరకు ఆయనకు 21,043 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 3,658 ఓట్లురాగా, బీఎస్పీ అభ్యర్థి 683, నోటాకు 699 ఓట్లు పోలయ్యాయి. దీంతో రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెరుగుతుంటంతో వైసీపీ భారీ ఆధింక్యంతో గెలిచే అవకాశం ఉన్నది. మధ్యాహ్నంలోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది.
ఈ నెల 23న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగింది. మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా, 1,37,081 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లు 493 ఉన్నాయి. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు, 20 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. కాగా, విక్రమ్ రెడ్డి ఆధిక్యం భారీగా ఉండటంతో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

