Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. నటుల సంఘం.. పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్షమే అని అన్నారు. నిబద్ధతతో పనిచేసే నాయకులకు జనసేనలో ఉరివేశారని పేర్కొన్నారు.
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్షమే అని అన్నారు. నిబద్ధతతో పనిచేసే నాయకులకు జనసేనలో ఉరివేశారని పేర్కొన్నారు. రాజకీయంగా తమ వ్యక్తిత్వాన్ని చంపేశారని మండిపడ్డారు. విజయవాడ వెస్ట్‌లో సుజనా చౌదరిని ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వెల్లంపల్లిని ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని.. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు.
పోతిన మహేశ్ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. పార్టీ మారితే చెయ్యి నరకాలని పోతిన మహేశ్ అన్నారని.. మా కార్యకర్తలు కొబ్బరి బొండాల కత్తి కొరియర్ చేస్తారని విమర్శించారు. కార్యాలయం బయట వెయిట్ చేసింది మహేశ్ మరిచిపోయారని.. పోతిన మహేశ్‌ను నాయకుడిని చేసిందే జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. పవన్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేశ్‌కు లేదన్నారు. పోతిన వెళ్లిపోతారని తెలిసే పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వలేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పోతిన మహేశ్ వైసీపీలో చేరారని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

