AP News | కర్నూల్లో దారుణం.. శానిటేషన్ వర్కర్‌పై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు
AP News | ఏపీలోని కర్నూల్లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది.
AP News | ఏపీలోని కర్నూల్లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కాగా, రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. ఆదివారం ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. సడెన్‌గా నర్సమ్మపై దాడికి పాల్పడ్డారు.
కళ్లలో కారం కొట్టి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన తోటి న్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సమ్మను స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. ప్రస్తుతం నర్సమ్మ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

