డిక్లరేషన్‌పై సంతకం పెడితే ఏమైంది.. జగన్‌ను నిలదీసిన టీజీ వెంకటేశ్
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తేటతెల్లమైందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ తెలిపారు. కల్తీ ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో వాసత్వాలు బయటకు వస్తాయని అన్నారు. ఆధారాలు ఎవరూ మార్చలేరని అంతా బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తేటతెల్లమైందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ తెలిపారు. కల్తీ ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో వాసత్వాలు బయటకు వస్తాయని అన్నారు. ఆధారాలు ఎవరూ మార్చలేరని అంతా బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
నార్త్‌లో యానిమల్ ఫ్యాట్ కామన్ అయిపోయిందని టీజీ వెంకటేశ్ అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుందని తెలిపారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నారని విమర్శించారు. తిరుమలలో అవకతవకలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయని.. వాటిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని.. వైవీ సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్తురాలు అని తెలిపారు. వారిని టీటీడీ చైర్మన్లుగా ఎందుకు నియమించారని జగన్‌ను ప్రశ్నించారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరగడంపై హిందూ సమాజం ఆగ్రహంతో ఉందని టీజీ వెంకటేశ్ తెలిపారు. డిక్లరేషన్‌పై జగన్ ఎందుకు సంతకం పెట్టడం లేదని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి తిరుమల సెట్టింగ్ వేసుకున్న జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెడితే ఏమైందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు ఎవరూ మార్చలేరని.. నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

