Pawan Kalyan | నేను ఎమ్మెల్యేగా జీతం ఎందుకు తీసుకుంటానంటే .. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు.
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే(MLAs) లకు, ఎంపీలకు పలు సూచనలు చేశారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం (Salary) రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటానని వెల్లడించారు. జీతం ముఖ్యం కాదని, అంతకు మించి నా సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానని అన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వీలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించారని తెలిపారు.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైందని , చిన్న నిర్ణయం ఎన్డీయే(NDA) కు ఊత మిచ్చిందని అన్నారు. జనసేన గోరంత దీపమని.. కొండంత వెలుగునిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థులకంటే ఎక్కువ మెజార్టీ తనకు రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఉత్సహాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు బలమైన మార్పును కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెలో పెట్టుకుని చూసుకోవాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

