Chandrababu Arrest | చంద్రబాబు అరెస్టుకు ముందు స్పీకర్‌కు సమాచారమిచ్చాం : సీఐడీ న్యాయవాది
Chandrababu Arrest | టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో ఏసీబీ కోర్టు ( ACB court) లో దాదాపు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగుతున్నాయి.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో ఏసీబీ కోర్టు ( ACB court) లో దాదాపు ఏడు గంటలకు పైగా వాదనలు కొనసాగుతున్నాయి. అటు సీబీఐ న్యాయవాదులు, ఇటు చంద్రబాబు (Chandra Babu) కు సంబంధించిన న్యాయవాదులు ఇరువురు తమ వాదనలు కొనసాగిస్తుండడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన వాదనల్లో ఇరువురు న్యాయవాదులు తమ పట్టును కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది (CBI Advocate) తన వాదనలు కొనసాగిస్తూ చంద్రబాబు అరెస్టు (Arrest) కు ముందు స్పీకర్ (Speaker ) కు సమాచారం అందించామని వెల్లడించారు. చంద్రబాబు వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే. అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. గవర్నర్‌కు మూడు నెలలలోపు సమాచారం ఇచ్చి రాటిఫై చేయొచ్చని వాదించారు.
అరెస్టుకు ముందు స్పీకర్‌కు సమాచారం అందించామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ నిధులు ఎక్కడెక్కడకు మళ్లాయో తెలియాలంటే బాబును విచారించాలని రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ నిధులు వివిధ దశల్లో చేతులు మారిందని ఆరోపించారు.
కాగా ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది లూథ్రా (Luthra ) వాదిస్తూ చంద్రబాబుపై ఆదారాలు లేని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- arrest
- chandrababu
- Inform
- Speaker
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

