Prashna Ravan | ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు : ప్రశ్న రావణ్ భార్య బచ్చలకూర అనూష
Prashna ravan | నా భర్తది "కమ్మ కులం". నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవని యూట్యూబర్ రావణ్ భార్య బచ్చలకూర అనూష స్పష్టం చేసింది.
Prashna ravan | యూట్యూబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని బచ్చలకూర అనూష పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన చేసింది.
రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి, నా భర్తది “కమ్మ కులం”. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
గొంతులేని వర్గాలకు ఒక గొంతుగా నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది తప్ప, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయమని అనూష ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణమని వాపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికే రావణ్‌ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు. కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నానని విజ్ఞప్తి చేసింది.
Read Also :
SKN | ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో ఆసక్తికర ఘటన.. ఎస్కేఏఎన్ స్పీచ్ మధ్యలో ‘జై ఎన్టీఆర్’ నినాదాలు
Prakash Raj | నటుడు ప్రకాశ్‌రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీజేపీ నేత
AP News | అలాంటి మనిషిని మనుషుల జాబితాలో చేర్చలేం.. మాజీ సీఎం జగన్‌పై ఏపీ మంత్రి తీవ్ర విమర్శలు..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

