Gudivada Amarnath | పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు కాదు.. మళ్లీ గెలిచేది వైసీపీనే.. గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని తెలిపారు.
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని తెలిపారు. విశాఖలో గురువారం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఓటర్లు తమ పార్టీవైపే నిలబడ్డారని పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్‌తోనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలే గెలిచిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత నేత వైఎస్సాఆర్ ఘనవిజయం సాధించారని.. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారని తెలిపారు. గతంలో కంటే కూడా ఈసారి వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అండగా నిలబడిందని.. అందుకే వార్ వన్‌సైడ్ కాబోతుందని అన్నారు. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నామని.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు.
ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్లోనే ప్రతిపక్ష పార్టీలు గొడవలకు దిగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రావద్దని.. ప్రాంతీయ పార్టీల అవసరం వాళ్లకు ఏర్పడాలని అన్నారు. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి అని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

