పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దాం అంటూ కోటి కొట్టేశాడు.. మోసపోయిన విజయవాడ యువతి
Cyber Crime | నిన్ను పెళ్లి చేసుకుంటా.. అమెరికా తీసుకెళ్తా.. లగ్జరీ కార్లలో తిప్పుతా.. ఏ కష్టం రాకుండా చూసుకుంటా.. అంటూ మాయమాటలు చెప్పి కోట్లు దోచేస్తున్న కేటుగాళ్ల గురించి రోజూ వార్తలు వస్తున్నా ఇంకా కొంతమంది మోసపోతూనే ఉన్నారు.
Cyber Crime | నిన్ను పెళ్లి చేసుకుంటా.. అమెరికా తీసుకెళ్తా.. లగ్జరీ కార్లలో తిప్పుతా.. ఏ కష్టం రాకుండా చూసుకుంటా.. అంటూ మాయమాటలు చెప్పి కోట్లు దోచేస్తున్న కేటుగాళ్ల గురించి రోజూ వార్తలు వస్తున్నా ఇంకా కొంతమంది మోసపోతూనే ఉన్నారు. ఆ మోసగాళ్ల వలలో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ మోసగాడి మాటలు విని విజయవాడకు చెందిన ఓ యువతి కోటి రూపాయలకు పైగానే పోగొట్టుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని దేవీనగర్‌కు చెందిన ఓ యువతి ఎంటెక్ పూర్తి చేసింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెండ్లి సంబంధాలు చూస్తుండటంతో తన ప్రొఫైల్‌ను ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అది చూసి కె.శ్రీకాంత్ అనే యువకుడు ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమెకు ఫోన్ చేశాడు. తన ఫ్యామిలీ విశాఖపట్నంలో ఉంటుందని.. తాను అస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. శ్రీకాంత్ డీటైల్స్, అతని తీరు నచ్చడంతో అతనితో పెండ్లికి సదరు యువతి అంగీకరించింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికా వెళ్తున్నానని.. త్వరలోనే పెండ్లి చేసుకుంటున్నాం కాబట్టి అక్కడి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని యువతికి శ్రీకాంత్ సూచించాడు. పాస్‌పోర్టు, వీసా తీసుకోవాలని ఇందుకోసం సిబిల్ స్కోర్ 842 పాయింట్ల వరకు ఉండాలని నమ్మించాడు.
శ్రీకాంత్ మాయమాటలు నమ్మిన యువతి.. సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు అప్లై చేసింది. మైక్రోఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుంది. ఆమె తీసుకోవడంతో పాటు తన తండ్రి, సోదరుడితో కూడా పలు సంస్థల నుంచి రుణాల కోసం అప్లై చేయించింది. అలా వచ్చిన రూ.1.06కోట్లను శ్రీకాంత్ సూచన మేరకు హరీశ్ సంపంగి అనే వ్యక్తి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్నుంచి శ్రీకాంత్ వాళ్ల ఫోన్లకు సమాధానం ఇవ్వడం మానేశాడు. ఏమైందా అని ఆలోచిస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సైబర్ సెల్ పోలీసుల నుంచి యువతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. శ్రీకాంత్ గురించి ఆరా తీసిన పోలీసులు.. అతను ఒక సైబర్ నేరస్తుడు అని చెప్పారు. దీంతో మోసపోయామని గ్రహించిన సదరు యువతి ఈ నెల 15న.. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More :
“రెండో పెండ్లి చేసుకునే యువతులే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. జాగ్రత్త పడకపోతే అంతే !!”
10 నిమిషాల ఆనందానికి 10 లక్షలు పొగొట్టుకున్నాడు.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
“Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్‌కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి”
“నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి”
“అందమైన అమ్మాయి అడిగిందని కోటి ట్రాన్స్ఫర్ చేశాడు.. తీరా చూస్తే..”
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

