జనవరి 2 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది.
తిరుమల : తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. వైకుంఠ ద్వార విషయంలో గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభించి 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశామని త్వరలో మొదటి దశ టెండర్లను పిలుస్తామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

