AP CM Jagan | కార్లను మార్చినట్టు.. భార్యలను మారుస్తున్నాడు.. పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు
AP CM Jagan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమవరంలో నిర్వహించిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. త్యాగాల త్యాగరాజు, మ్యారేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
AP CM Jagan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమవరంలో నిర్వహించిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. త్యాగాల త్యాగరాజు, మ్యారేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
దత్తపుత్రుడి శాశ్వత నివాసం పక్క రాష్ట్రంలో ఉందని.. అతను నాన్ లోకల్ అని జగన్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ.. పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టినవాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు.. అవే తనకు వందల కోట్లతో సమానమని.. బాబు కోసమే తన జీవితం అని.. అందుకు అంగీకరించని వాళ్లు తన పార్టీలో ఉండకూడదని.. ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని.. నచ్చని వాళ్లు తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని ఉపన్యాసాలు ఇచ్చే వారిని ఎవర్నీ చూసి ఉండమని అన్నారు. ఈ దత్తపుత్రుడికి.. ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే.. ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే అని అన్నారు. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజును ఇప్పుడే.. దత్తపుత్రిడిలో మాత్రమే చూస్తున్నామని సెటైర్ వేశారు.. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసే వారిని చూశామని.. కానీ.. ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం ఎప్పుడూ చూసి ఉండమని అన్నారు. ప్యాకేజీ కోసం తన వారిని త్యాగాలు చేసే త్యాగాల త్యాగరాజును మాత్రం ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ మ్యారేజి లైఫ్‌పై కూడా జగన్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను మ్యారేజి స్టార్ అంటూ విమర్శించారు. రియల్ లైఫ్‌లో ఈ పెద్ద మనిషి.. ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలు అయినా కాపురం చేయలేదని అన్నారు. ఈ మ్యారేజి స్టార్.. ఆడవాళ్లను కేవలం ఆటవస్తువులుగా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతూ.. నాలుగేండ్లకు ఒకసారి పెండ్లి చేసుకోవడం.. మళ్లీ విడాకులు ఇచ్చేసేయడం.. కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడని అన్నారు. తనకు అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. మనకు చెల్లెళ్లు ఉన్నారని.. మన ఇండ్లలో ఆడబిడ్డలు ఉన్నారని అన్నారు. ఇలాంటి వాళ్లు నాయకులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అయితే.. ఇలాంటివాళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని.. ప్రతి ఒక్కరూ నాలుగేండ్లకు ఒకసారి.. మూడేండ్లకు ఒకసారి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మన ఆడబిడ్డల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి వాడికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని ఆలోచన చేయాలని సూచించారు. ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగేండ్లు కాపురం చేయలేడు కానీ.. పొలిటికల్ లైఫ్‌లో మాత్రం.. చంద్రబాబుతో తన వివాహబంధం కనీసం పది, 15 సంవత్సరాలు అయినా ఉండాల్సిందేనని.. ఏకంగా తన కేడర్‌కు చెబుతున్నాడని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

