AP News | మా భార్యలు కాపురానికి వచ్చేలా చూడండి ప్లీజ్.. మామపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అల్లుళ్లు
AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు. తమ భార్యలను కాపురానికి పంపించాలని అల్లుళ్లు ఎంతగా బతిమిలాడిన వినిపించుకోకుండానే వారిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు.
AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు. తమ భార్యలను కాపురానికి పంపించాలని అల్లుళ్లు ఎంతగా బతిమిలాడిన వినిపించుకోకుండానే వారిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. మామ వేధింపులతో కుంగిపోయిన ఇద్దరు అల్లుళ్లు.. తమ భార్యలను కాపురానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌కు ఇద్దరు కుమార్తెలు. 2015లో పెద్ద కుమార్తెను గుజరాత్లో ఉద్యోగం చేస్తున్న పవన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లయిన రెండేళ్లకే కుమార్తెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక రెండో కుమార్తెకు విజయవాడకు చెందిన శేషసాయితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిపించాడు. అయితే చిన్న కుమార్తెను కూడా కాపురానికి పంపించకుండా ఇంటి దగ్గరే పెట్టుకున్నాడు. ఇదేంటి మా భార్యలను కాపురానికి పంపించడం లేదని అల్లుళ్లు ఎంతగా అడిగినా ఆ మామ వినిపించుకోవడం లేదు.
తమ భార్యలను కాపురానికి పంపించాలని పదే పదే అడుగుతుండటంతో అల్లుళ్లనే ఆ మామ బెదిరిస్తున్నాడు. మళ్లీ తన ఇంటికి వస్తే తనను వేధిస్తున్నారని అక్రమ కేసులు పెడతానని వేధిస్తున్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ఇద్దరు తోడళ్లుల్లు ఏలూరు కలెక్టరేట్ మెట్లు ఎక్కారు. కలెక్టర్ ముందు తమ బాధను వెల్లగక్కారు.
తమ మాకు ఏలూరులో మంచి పలుకుబడి ఉందని, పోలీసు డిపార్ట్మెంట్లోనూ పరిచయాలు ఉన్నాయని బాధిత అల్లుళ్లు తెలిపారు. ఆ పరిచయాలను వాడుకుని తమ భార్యలతోనే తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తమ భార్యలను కాపురానికి పంపించేలా తమ మామపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ వినతి పత్రం రాసి కలెక్టర్‌కు అందజేశారు. అంతేకాకుండా ఓ బ్యానర్ కట్టుకుని నిరసన కూడా చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Eluru
- Husband
- Son in Law
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


