నేడు శ్రీవారి ఆర్జిత, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అంగప్రదక్షిణం, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అంగప్రదక్షిణం, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం కోటా టికెట్లను ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇక డిసెంబర్ నెల శ్రీవారి సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ప్రారంభించి 24వ తేదీ ఉదయం 10 గంటలకు ముగించనున్నారు. అనంతరం డిప్‌ను నిర్వహించి టికెట్లు పొందిన వారికి సమాచారాన్ని అందించనున్నారు. కాగా, ఈ నెల 24న దీపావళి, 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉండటంతో ఈ మూడురోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. అందువల్ల ఈ నెల 23న, నవంబర్ 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

