10 గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుల చేయనున్నది. డిసెంబర్ మాసం మొత్తానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచనున్నది. కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. కాగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబర్ నెల కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
ఇలా బుక్ చేసుకోండి..
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్(https://tirupatibalaji.ap.gov.in/#/login) లోకి వెళ్లాలి. తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగానే రిజిస్టర్ చేసుకున్నవారైతే లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లేటెస్ట్ అప్డేట్లో ఉండే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్ చేయాలి. అనంతకు మనకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్ చేసుకొని డబ్బు చెల్లించాలి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

