ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు
తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య...
తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. పేదింటి పిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఈ ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న రోజుల్లో కళ్యాణమస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారని ఆయన గుర్తు చేశారు.
పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని వెల్లడించారు.
అర్హులైన వారు తమ తమ జిల్లాల కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే కూడా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వైఎస్సార్ తీసుకొచ్చిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని సీఎం జగన్ ఆదేశాలతో పునఃప్రారంభించడం సంతోషంగా ఉన్నదని సుబ్బారెడ్డి వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

