తిరుమల బాలాజీనగర్లో టీటీడీ ఈఓ తనిఖీలు
తిరుమల బాలాజీనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి బుధవారం అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా బాలాజీనగర్లో డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు...
తిరుపతి జిల్లా : తిరుమల బాలాజీనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి బుధవారం అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా బాలాజీనగర్లో డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితర వాటిని కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇనుము తదితర వ్యర్థాలను తిరుపతికి తరలించాలన్నారు. వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటివరకు 480 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈఓకు తెలిపారు. అనంతరం అక్కడి స్థానికులకు టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను ఆరు బయట పారవేయకుండా స్థానికులు చూడాలని, పరిసరాల పరిశుభ్రతతోనే శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చునని ఈఓ చెప్పారు. తిరుమల కొండపై పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శ్రీదేవి, వీజీఓ బాలిరెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డితో పాటు పలు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

