అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలో ఘోర ప్రమాదం (Tragic Acciden ) జరిగింది. రైల్వేట్రాక్( Railway Track) నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ( Rajarani Express ) ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాకుళం టెక్కలి బర్మా కాలనీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతులంతా ఒడిసాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. రైల్వేట్రాక్ పక్కన చేపలు పట్టేందుకు హాస్టల్ విద్యార్థులు వెళ్లగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.