Tragedy | బీచ్లో విషాదం.. ఒకరు గల్లంతు.. మరొకరు మృతి
Tragedy | సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలోని ఒకరు సముద్రంలో గల్లంతు కాగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
అమరావతి : సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలోని ఒకరు సముద్రంలో గల్లంతు కాగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గుడివాడ(Gudiwada) కు చెందిన ఆరుగురు సభ్యులు గల కుటుంబం కృష్ణా జిల్లా (Krishna District) కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్కు ఆదివారం వచ్చారు. సముద్రంలో వారంతా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలలకు సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్, బీచ్ మెరైన్ పోలీసులు వారిలో ఐదుగురిని ఒడ్డుకు చేర్చారు.
అబ్దుల్ ముషారఫ్ అనే వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యడు. వీరిలో అబ్దుల్ ఫజల అనే మహిళ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. గల్లంతైన ముషారఫ్ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
Read more :
AP News | గుళికల మందు చల్లుతూ 8 మంది రైతు కూలీలకు అస్వస్థత
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

