వైఎస్సార్ జిల్లాలో విషాదం.. తల్లి,ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
Tragedy|వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లలో విషాదం చోటుచేసుకుంది. యర్రగుంట్లలోని నీటిగుంతలోకి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు
అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లలో విషాదం చోటుచేసుకుంది. యర్రగుంట్లలోని నీటిగుంతలో కి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6) గా గుర్తించారు. వేంపల్లి రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వెనుక తవ్వకాలు చేపడుతున్న గని వరద నీటిలో యర్రగుంట్లలో నివాసముంటున్న లక్ష్మీదేవి, తన ఇద్దరు పిల్లలతో కలసి దూకి ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా లక్ష్మీదేవి మృతదేహాన్ని లోతులో గాలించగా దొరికింది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

