Home
Andhrapradesh-news
Tragedy Couple Died While Receiving Treatment In Gas Cylinder Explosion Incident
Tragedy | విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో చికిత్సపొందుతూ దంపతులు మృతి
Tragedy | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం( Tragedy )చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం( Tragedy )చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు ఎస్సీ కాలనీలో బాలకోటయ్య, ఈశ్వరమ్మ దంపతులు నివశిస్తున్నారు. ఈనెల 18న గ్యాస్ పొయ్యి పాడవడంతో టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మకు మంటలంటుకొని 80 శాతం శరీరం కాలిపోయింది. పక్కనే ఉన్న టెక్నీషియన్‌తో పాటు భర్త బాలకోటయ్యకు గాయలయ్యాయి. దంపతుల కుమారుడు శ్రీనుకు స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ దంపతులను హుటాహుటినా ఒంగోలు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ దంపతులిద్దరూ ఆదివారం మృతి చెందడంతో ఎస్సీకాలనీలో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

