Tirumala Brahmotsavalu | ఈ నెలలోనే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదీ!
Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని టీటీడీ తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు
సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ
సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం5.43 గంటల నుంచి 6.15 గంటల మధ్యలో మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ
సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ
సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు స్వపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ
సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటలకు స్వపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ
సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ
సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ
సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ
అక్టోబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

