తిరుపతి : తిరుచానూరు(Tiruchanoor) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు(Vasantostavam) శనివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్లరసాలతో అభిషేకం (Abhishekam)చేశారు.రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుభాష్ పాల్గొన్నారు.