Rains | ఏపీలో రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
Rains | అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అమరావతి : అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వ్యాప్తంగా శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (Eluru) , కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా్ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది .
శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రేపు 33 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 30న కేరళ (Kerala) లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నందున, ఏపీలోకి జూన్ మొదటివారంలో వర్షాలు విస్తరించే సూచనలు ఉన్నాయని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

