Road accident | పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road accident | ఏపీలోని పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident )ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని వినుగొండ మండలం కొత్తపాలెం వద్ద అతి వేగంగా వచ్చిన కారు (Car) చెట్టును ఢీకొట్టింది.
గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ కుటుంబం కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు ఇన్నోవా కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బాలగంగాధర్ శర్మ, ఆయన సతీమణి యశోద, కారు డ్రైవర్ మృతి చెందారు. బాల గంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్వై శర్మ, ఆయన భార్య నాగ సంధ్య, వీరి పిల్లలు కార్తిక్, అనుపమ గాయపడ్డారు.
గాయపడ్డ క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

