RRR Cinema | ‘ఆర్ఆర్ఆర్ ’ గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది : నటుడు ఉపేంద్ర
RRR Cinema | ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra ) అన్నారు.
అమరావతి : ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్ఆర్ఆర్’(RRR Cinema ) సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra ) అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని హంగులు ఉన్న సినిమా అని ప్రశంసించారు. అటువంటి సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
‘కబ్జా’ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి గురువారం ఆయన తిరుమల(Tirumala)లోని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన వారంతా అద్భుత నటనను ప్రదర్శించారని, సాంకేతిక పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించారని అన్నారు. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. కబ్జా చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నానని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

