సీపీఐ, టీడీపీ నాయకుల పోరాటం అభినందనీయం.. ఎంపీ రఘురామకృష్ణరాజు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, సీపీఐ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంఖ్యాబలం లేకున్న అద్భుతంగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని పాదయాత్రలో పేర్కొన్న సీఎం జగన్ ప్రస్తుతం దానిపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు.
మద్యనిషేధం అమలు చేయకపోతే ఓట్లు అడగనని జగన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మాట తప్పినందున వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఓట్లరు అడుగుతారా.. లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేయడాన్ని రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

