Srisailam | ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయం : వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖులు
Srisailam | శ్రీశైలమహా క్షేత్రంలో మల్లికార్జున సత్ర సంఘం, ఆర్యవైశ్య దివ్యసేవాధామం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన టిజి లక్ష్మీ వెంకటేష్ భవన్ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
శ్రీశైలం : శ్రీశైల (Srisailam Temple) మహా క్షేత్రంలో మల్లికార్జున సత్ర సంఘం, ఆర్యవైశ్య ( Arya Vaishyas) దివ్యసేవాధామం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన టిజి లక్ష్మీ వెంకటేష్ భవన్ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
వేడుకల్లో భాగంగా రెండవరోజు శనివారం కల్వకూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ( MLA Kasireddy) దంపతులు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి దంపతులు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దంపతులు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. వీరు శనివారం తెల్లవారుజామున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని టీజీ భవన వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక సేవలకు అలవాటు పడాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
యాంత్రిక జీవనాలకు అలవాటు పడుతున్న మానవాళికి సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయడం అలవర్చుకోవడంతో మానసిక ఉల్లాసమే కాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శ్రీశైల క్షేత్రానికి దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు వచ్చి వెళ్లే క్రమంలో వారి సౌకర్యార్థం ఇటువంటి వసతి గదుల నిర్మాణం హర్షనీయమని ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులను ప్రశంసించారు.
ఐకమత్యం అభినందనీయం – కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయడంలోనూ ఐకమత్యంగా ఉండటం అభినందనీయమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (MLA Kasireddy Narayana Reddy) అన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే వారికోసమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చేపట్టిన 143 గదుల నిర్మాణ దాతలకు శుభాకాంక్షలు చెప్పారు.
అన్ని విధాలుగా అండగా ఉంటా – కూచకుళ్ల రాజేష్‌రెడ్డి
శ్రీశైలంలో చేపట్టిన ఆర్యవైశ్య భవన నిర్మాణం అందరికీ ఆదర్శనీయమని.. ఇటువంటి మంచి పనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మల్లన్న భక్తులకు సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కూడా కల్పించాలని కూకట్పల్లి శాసనమండలి సభ్యులు మాధవరం కృష్ణారావు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులను కోరారు.
ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మిడిదిడ్డి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి బలుస శ్రీరాములు, రామకృష్ణ, ఆంజనేయులు, చంద్రశేఖర్, పోలసాయిబాబాతోపాటు సంఘం ప్రతినిధులు ఎమ్యేల్యేలను ఘనంగా సత్కరించి ఙ్ఞాపికలను అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

