హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని పద్మారావు పేర్కొన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కలిచి వేసింది. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత చిన్న వయసులో కన్ను ముశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. మేకపాటి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం తీవ్రంగా కలచివేసింది. పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరం. మేకపాటి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సమర్థవంతమైన మంత్రిగా గుర్తింపు పొందిన గౌతంరెడ్డి అకాల మరణం చెందడం బాధాకరం. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం చాలా బాధాకరం. చిన్న వయసులోనే గుండె పోటుకు గురై మృతి చెందడం తీవ్ర విచారకరం, బాధాకరం. గౌతంరెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను. – మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. – మంత్రి సత్యవతి రాథోడ్