Chandrababu on Vijayamma | మొన్న చెల్లి.. ఇప్పుడు తల్లి వెళ్లిపోయారు.. విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు సెటైర్లు
Chandrababu on Vijayamma | వైసీపీ నుంచి నుంచి మొన్న చెల్లి, ఇప్పుడు తల్లి వెళ్లిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు.
Chandrababu on Vijayamma | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మొన్న చెల్లి షర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం, శనివారం జరుగనున్నాయి.
తొలి రోజు సమావేశంలో పాల్గొన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కూతురు వైఎస్ షర్మిలకు అండగా నిలిచేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు స్పందిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ అందరినీ వాడుకుంటాడు అని ఎద్దేవా చేశారు.
చీకటి పాలన వద్దూ చీకటి జీవోలు వద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అన్నా చెల్లెండ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

