TDP MLA Protest | వర్షంలో రోడ్డుపై నిలబడి టీడీపీ ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే ?
TDP MLA Protest | ఏపీలో అధికార పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వినూత్న తరహాలో నిరసన తెలిపి సంచలనం కలిగించారు.
అమరావతి : ఏపీలో అధికార పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) వినూత్న తరహాలో నిరసన తెలిపి సంచలనం కలిగించారు. వర్షంలో తడుస్తూ రోడ్డుపై నిలబడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(Tiruvoor) నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు (Srinivas rao) శనివారంనాడు తిరువూరు పట్టణంలోని వార్డులో ఆకస్మికంగా పర్యటించారు.
వార్డులో రోడ్డుపై వర్షం నీరు నిలిచి ఉండడంతో వర్షంలో గంటపాటు నిలబడి ఆర్అండ్ బీ(R and B) అధికారులపై నిరసన తెలిపారు. రోడ్ల గుంతలను ఎందుకు పూడ్చడం లేదంటూ అక్కడికి వచ్చిన అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. రోడ్ల మంజూరికి విడుదలైన నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా రోడ్లకు మరమ్మతులు చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదే ఎమ్మెల్యే గత 20 రోజుల క్రితం జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చిన ఘటనపై ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.
పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి ఎమ్మెల్యేను పిలిపించుకుని మాట్లాడారు. ప్రజాప్రతినిధికి ఓర్పు, సహనం ఉండాలని సూచిస్తూనే మొట్టికాయలు వేశారు.
Read more :
Chandrababu | కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలి : ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
YS Jagan | మనం పోరాటం చేయకపోతే ఈ దారుణాలు ఆగవు.. వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

