Kollu Ravindra | పేర్ని నాని కుటుంబం అందుకే పరారీలో ఉంది.. కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు
Kollu Raveendra | వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ నేతలు పరామర్శించడాన్ని తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసిందని దుయ్యబట్టారు.
Kollu Ravindra | వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ నేతలు పరామర్శించడాన్ని తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసిందని దుయ్యబట్టారు. అందుకే పేర్ని నాని కుటుంబమంతా పరారీలోనే ఉందని పేర్కొన్నారు. దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని విమర్శించారు.
పేదల బియ్యం నొక్కేసి పేర్ని నాని నీతి కబుర్లు చెబుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండిపడ్డారు. పేర్ని నాని వ్యవహారంతో వైసీపీ మొత్తం దొంగల పార్టీనే అని అర్థమవుతుందని విమర్శించారు.
పేర్ని నాని గోదాములో పౌర సరఫరాల శాఖ ఉంచిన 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పేర్ని నాని కుటుంబంపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. దీంతో ఆయన్ను వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

