YS Jagan | చంద్రబాబు ఓ శాడిస్టు.. కొనకమిట్ల సభలో ఏపీ సీఎం జగన్ ఫైర్
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. అసూయ, కుళ్లు, కడుపు మంటతో టీడీపీ అధినేత చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు. ఎన్ని జెలసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. వ
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. అసూయ, కుళ్లు, కడుపు మంటతో టీడీపీ అధినేత చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు. ఎన్ని జెలసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు వల్లే పేదల ఇంటికి ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయాయని అన్నారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడని.. అవ్వాతాతలను చంపుతున్న హంతకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్టు కాకపోతే ఇంకా ఏంటని ప్రశ్నించారు.
మంచిని కొనసాగించేందుకు చేస్తున్న నినాదమే మేమంతా సిద్ధం! అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రజా క్షేమం కోసం తాము వస్తుంటే.. సంక్షేమాన్ని, పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నాయని విమర్శించారు. ఈ కూటమిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని.. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తెల్చే ఎన్నికలు అని చెప్పారు.
ఇవి జగన్, చంద్రబాబు మధ్య ఎన్నికలు కాదని.. పేదలు, చంద్రబాబు మోసాల మధ్య ఎన్నికలు అని వివరించారు. ఈ ఎన్నికల్లో తనది పేదల పక్షమని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలేమీ ఉండవని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఓటేస్తే సంక్షేమం కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే ముగింపు అని తెలిపారు. చంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే అని విమర్శించారు. ఆయన ఆలోచనలెప్పుడూ పాతాళంలోనే ఉంటాయన్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వెన్నుపోటు, దగ, కుట్ర అని ఎద్దేవా చేశారు. విలువలు, విశ్వసనీయతకు ఆయనకు అర్థం తెలియదని విమర్శించారు. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌తో పెన్షన్ల పంపిణీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించి.. 56 నెలలుగా అందుతున్న కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేయించాడని మండిపడ్డారు.
చంద్రబాబు వల్లే పేదల ఇంటికి ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయాయని జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడని.. అవ్వాతాతలను చంపుతున్న హంతకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్టు కాకపోతే ఇంకా ఏంటని ప్రశ్నించారు. శాడిస్టు అంటే ఎవరని ఈ దొంగల ముఠాను అడుగుతున్నా అని అన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేనివాడే శాడిస్టు.. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడే శాడిస్టు.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లేవాడు శాడిస్టు.. వ్యవసాయం దండగ అనేవాడే శాడిస్టు.. ఫ్రీ కరెంటు ఇస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలన్నవాడే శాడిస్టు.. దళితులను అవమానించినవాడే శాడిస్టు అని అన్నారు. సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టినవాడు.. ఆంబోతులంటూ వాలంటీర్లను కించపరిచినవాడే శాడిస్టు అని అన్నారు. చేసిన మంచిని చెప్పిన గీతాంజలిని చంపేశారని మండిపడ్డారు.
అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నాడని జగన్ విమర్శించారు. ఎన్ని జెలసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గని కడుపు మంట చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. బాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. ప్రతి సంక్షేమంలో మీ బిడ్డ జగన్ కనిపిస్తారని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

