Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. ఐఆర్ఆర్ కేసులో అరెస్టు చేయొద్దని ఆదేశం
Chandrababu | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu | అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ బాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఈ కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్లో ఉందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

