Supreme Court | చంద్రబాబుకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‌పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ (Skill Development Case) కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‌పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu)కు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్తయ్యేంతరకు సుప్రీం(Suprme Court) ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించ వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తు కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
స్కిల్ కేసులో ఏపీ సీఐడీ(AP CID) గత ఆగస్టులో చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజుల పాటు జైలులో ఉంచింది. అయితే చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణలో ఉండగా కేసుపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. సీఐడీ వాదనలను ఏపీ హైకోర్టు (AP High Court) పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ, ప్రభుత్వం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను రద్దుచేయాలని దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం కేసు విచారణకు వచ్చింది.
కోర్టులో కేసు విచారణలో ఉండగా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సీఐడీ, అధికారుల పేర్లను రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని కోర్టులో సీఐడీ వాదనలు వినిపించింది. ఈ హెచ్చరికల ప్రభావం అధికారులపై పడే సూచనలున్నాయని, ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ తరుఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని సూచిస్తూ కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

