స్వామివారిని తాకని సూర్యకిరణాలు.. నిరాశలో భక్తులు
aarasavalli | శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశ ఎదురైంది. ప్రతియేట మూలవిరాట్‌ను తాకే సూర్య కిరణాలు ఈసారి నిరాశ
అమరావతి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశ ఎదురైంది. ప్రతియేట మూలవిరాట్‌ను తాకే సూర్య కిరణాలు ఈసారి నిరాశ పరిచాయి. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల కారణంగా ఏటా మార్చి 9,10 తేదీల్లో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో కూడా పాదాల నుంచి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకడాన్ని వీక్షించేందుకు భక్తులు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మంచు కారణంగా సూర్యకిరణాలు స్వామివారిపై పడకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు.

అదేవిధంగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్ద గంజాంలో భావన్నారాయణ స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. ఇక్కడ కూడా ఏటా మార్చి, అక్టోబర్ మొదటి వారాల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు తరలి వచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

