అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి...
శ్రీకాకుళం : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి చేరుకున్నారు. మూలవిరాట్ పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. ఏడాదిలో రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది.
శ్రీకాకుళం జిల్లా ఆరసవల్లిలోని సూర్య నారాయణుడి ఆలయంలో మూలవిరాట్ పాదాలను సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వచ్చారు. తొలిరోజు సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకగానే భక్తులు పులకించిపోయారు. ఏటా రెండుసార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీల్లో, ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీల్లో స్వామివారికి కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నది. దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని పాదాల చెంత నిలిచాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి పులకించిపోయారు.
ఆదిత్యుని విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎప్పటినుంచో ఈ అద్భుతాన్ని చూడాలనుకున్నామని.. ఇప్పుడు ఆ భాగ్యం తమకు దక్కడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నారు పలువురు భక్తులు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

