Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత.. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు
Gudlavalleru Engineering College |కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని విద్యార్థులను కళాశాలలోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని వార్త గురువారం అర్ధరాత్రి సంచలనం సృష్టించింది. గర్ల్స్ హాస్టల్లో ఉండే ఓ విద్యార్థిని సాయంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హాస్టల్లోని వాష్‌రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వారికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని అనుమానితుల నుంచి లాప్టాప్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదని కృష్ణా జిల్లా ఎస్పీ తెలపడం గమనార్హం. కాగా, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

