శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు
మల్లన్న హుండీ ఆదాయం | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీని మంగళవారం ఉదయం లెక్కించారు. 19 రోజులకుగాను రూ. 1,96,05,093లను భక్తులు కానుకగా సమర్పించారు.

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ భద్రత నడుమ ఆలయ సిబ్బంది, శివసేవకులు, భక్తులు లెక్కింపు చేపట్టారు. 19 రోజులకుగాను రూ. 1,96,05,093 (కోటి తొంభై ఆరులక్షల ఐదు వేల తొంభై మూడు) నగదును భక్తులు కానుకగా సమర్పించినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
వీటితోపాటు 282.4 గ్రాముల బంగారం, 9.3 కేజీల వెండి ఆభరణాలు, 54 డాలర్లు (యూఎస్ఏ), 02 సింగపూర్ డాలర్లు, 20 ఇంగాండ్ ఫౌండ్లు, 7 ఓమన్ రియాల్స్, 10 ఫ్రాన్స్ సూసిస్ కరెన్సీని సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
చైత్రమాసంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు జరిగే కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా కొబ్బరికాయలు సమర్పించారు.
దేవస్థానం ఆనవాయితీ ప్రకారం స్వామివారి ఆలయంలో పనిచేసే పురుషుడు స్త్రీవేషధారణలో అమ్మవారికి ఇవాళ కొబ్బరికాయలు సమర్పించారు.
శివరాత్రి తరువాత వచ్చే ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి సింహ మండపం వద్ద అమ్మవారి సమర్పించనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
ఏప్రిల్ 30వ తేదీన అమ్మవారికి సాత్వికబలి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు ఈ ఓ కేఎస్ రామారావు పేర్కొన్నారు.
అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలతో కుంభోత్సవం నిర్వహిస్తారు.
కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఏఈఓ హరిదాసు, సూపరింటెండెంట్ అయ్యన్న, ఆలయ ప్రధానార్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

