Srisailam dam | శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద..గేట్లు మూసివేత
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గురువారం మూడు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా తగ్గిస్తూ మధ్యాహ్నం గేట్లను పూర్తిగా మూసివేశారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 28,238, విద్యుదుత్పత్తి ద్వారా 42,363, సుంకేసుల నుంచి 25,866 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, సాయంత్రానికి 98,765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గురువారం మూడు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా తగ్గిస్తూ మధ్యాహ్నం గేట్లను పూర్తిగా మూసివేశారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 28,238, విద్యుదుత్పత్తి ద్వారా 42,363, సుంకేసుల నుంచి 25,866 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, సాయంత్రానికి 98,765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
అలాగే, ఏపీ పవర్‌హౌస్‌లో 23,304, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసుకుని, దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులవరకు నీరుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.43 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

