సెయింట్ లూయిస్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణం
సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్‌లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది...
తిరుపతి : అమెరికాలోని వివిధ నగరాల్లో వరుసగా శ్రీనివాస కల్యాణాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్నది. అమెరికాలో స్థిరపడిన హిందువులకు శ్రీవేంకటేశ్వరుడి కల్యాణాన్ని తిలకించే భాగ్యం కలిగించేందుకు టీటీడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్‌లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది.
అద్భుతంగా అలంకరించిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు.. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు. కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఏఈఓ వెంకటేశ్వర్లు , ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్, నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొరిశపాటి తదితరులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సెయింట్ లూయిస్ వాస్తవ్యులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, పమ్మి సుబ్బారెడ్డి, ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ధర్మకర్తల మండలి చైర్మన్ రజనీకాంత్ గంగవరపు, అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి నాయుడు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
Bridal Weight Loss | పెండ్లి చూపుల్లో బొద్దుగా.. పెండ్లి నాటికి స్లిమ్‌గా! అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా?
Kaleshwaram | కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?.. పురాతన ఆలయం కూల్చివేసి 4 నెలలవుతున్నా ముందుకు సాగని పనులు
Nagarjuna Sagar | సాగర్‌లో ఏపీ దాదాగిరీ.. కుడికాలువకు అక్రమంగా నీటి విడుదల.. పల్నాడు గోల ఉండగానే ఆంధ్రా ఇష్టారాజ్యం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

