న్యూఇయర్, వైకుంఠద్వారా దర్శనం సందర్భంగా కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
అమరావతి : నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
సామాన్య భక్తులకు, వీఐపీలకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము రెండు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
1, 2 వ తేదీల్లో రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం ,ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్‌లను నడుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

