Srisailam Temple | శ్రావణంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్.! స్పర్శ దర్శనాలు, అభిషేకాలపై కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం..!
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు తరలిరానున్నారు.
Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 రోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేయాలని నిర్ణయించారు. శ్రవణమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు ప్రభుత్వ సెలవుదినాలు, ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. మొత్తం 16 రోజుల పాటు భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తూ ఈ మేరకు ఆయా రోజుల్లో గర్బాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఆగస్టు మాసంలో నాలుగు రోజుల పాటు స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు. లడ్డూ ప్రసాదాలు, అన్నదాన విభాగంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆలయ దర్శనాల్లోనూ మార్పులు చేశారు. తెల్లవారు జామున మార్పులు 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఉభయ దేవాలయాల్లో మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించి.. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ వత్రాలు చేసుకునేవారికి స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. రెండవ, నాల్గో శుక్రవారాల్లో ఉచితంగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

