Trains Cancelled | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోకి కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఇక మరో 12 గూడ్స్ రైళ్లు ఏపీలో పలు రైల్వే స్టేషన్లలో ఆగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ సూచించింది. రద్దయిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్‌కు పంపించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయి రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే తమ ప్రయాణించాల్సిన రైలు స్టేటస్‌ను తెలుసుకోవాలన్నారు.
విజయవాడ డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు..
విజయవాడ 0866 – 2575167
నెల్లూరు 90633 47961
ఒంగోలు 78159 09489
బాపట్ల 78159 09329
తెనాలి 78159 09463
ఏలూరు 75693 05268
రాజమండ్రి 83319 87657
సామర్లకోట 73823 83188
తుని 78159 09479
అనకాపల్లి 75693 05669
భీమవరం 78159 09402
గుడివాడ 78159 09462
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

