బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. అలిపిరిలో కిడ్నాప్ విజయవాడలో ప్రత్యక్షం

అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్‌కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆచూకీ లభించడంతో అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు అతడిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన శివమ్‌కుమార్ సాహు (6) కుటుంబం గత నెల 27న శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింది. అలిపిరి బస్టాండ్ వద్ద కుటుంబం సేదతీరుతున్న సమయంలో ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కిడ్నాపర్ బాలుడిని తీసుకువెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్టాండులో సాహు కుటుంబం ఉన్న పక్కనే కిడ్నాపర్ పడుకుని పేపర్ చదువుతూ కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించి గాలింపు చేపట్టారు. చివరకు కిడ్నాపర్లే బాలుడిని విజయవాడలో దుర్గమ్మ ఆలయం వద్ద వదిలి వెల్లడంతో కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
Mallanna Sagar | మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
Horoscope | 30-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రియల్ అల్లకల్లోలం
తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

