Forbes | ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు మెరిశాడు. యంగ్ అచీవర్స్ అండర్ 30 జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా శివతేజను ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. మెడికల్ ఇమేజింగ్‌లో చేస్తున్న పరిశోధనలకు గానూ శివతేజకు ఈ గౌరవం దక్కింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామానికి చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. ఐఐటీ గువాహటిలో సీటు సంపాదించి ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తి చేశాడు. మేజర్ డిగ్రీగా ఈసీఈ, మైనర్ డిగ్రీగా సీఎస్ఈ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాడు. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు. అలాగే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. మెడికల్ ఇమేజింగ్‌లో ఇప్పటివరకు 25కిపైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తకాల అధ్యయాలకు సహ రచన చేశాడు. 23 ఇంటర్నేషనల్ పేటెంట్స్ దక్కించుకున్నాడు. వీటిని గుర్తించిన ఫోర్బ్స్ మ్యాగజైన్.. యంగ్ అచీవర్స్ టాప్ 30 అండర్ 30 జాబితాలో చోటు కల్పించింది.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్డేట్స్
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్ | వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : మంత్రి హరీశ్‌రావు