SI Suicide | సీఎం బందోబస్తుకు వెళ్తూ తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
SI Suicide | పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్ఐ ఏజీఎస్ మూర్తి స్టేషన్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్ ఎస్సై ( SI ) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్ఐ ఏజీఎస్ మూర్తి స్టేషన్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడ్డాడు.
సీఎం చంద్రబాబు శుక్రవారం పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌లో ఉన్న మూర్తికి బందోబస్తు విధులు అప్పగించారు. నిన్న భీమవరం డిపో నుంచి తుపాకీ తెచ్చుకుని తణుకు గ్రామీణ పీఎస్‌కు రిపోర్టు చేయడానికి వచ్చాడు. అయితే ఈరోజు ఉదయం స్టేషన్లో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకుని ( Fire ) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్టేషన్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పడికే ఆయన మృతి చెందాడు. గత కొన్ని రోజుల క్రితం ఎస్సై మూర్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేసి వీఆర్‌లో ఉంచారు. ఎస్సై ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

