సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన టీటీడీ టికెట్ల విడుదల
ttd tickets| ఈ రోజు నుంచి ప్రారంభించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతో ఆశతో బుకింగ్ కోసం
తిరుమల : ఈ రోజు నుంచి ప్రారంభించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతో ఆశతో బుకింగ్ కోసం క్యూలో గంటల తరబడి నిలబడ్డ భక్తులు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్య పరిష్కారానికి టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు విడుదల చేసిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈసారి శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ పెంచింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచింది. దీంతో మార్చి నెల సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ, నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను జారీచేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

