8 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్.. రూ.1.22 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు...
చిత్తూరు: ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరి అరెస్ట్‌తో జిల్లా ఇకపై ఎర్ర చందనం స్మగ్లర్లు కనిపించరని పోలీసులు ధీమాగా చెప్తున్నారు.
చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వై రిశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు తాలూకా పోలీసులు 8 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 122 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.22 కోట్ల వరకు ఉండనున్నది. చిత్తూరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఇంటెన్సివ్ వెహికల్ చెకింగ్ డ్రైవ్ చేపట్టగా రెడ్ సాండల్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది.
శనివారం తెల్లవారుజామున పోలీసులు ఒక లారీ, రెండు కార్లు, ఒక మోటార్ బైక్‌ను ట్రాప్ చేశారు. 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడు రాష్ట్రానికి తరలించి భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

