Mudragada Letter to Chandra Babu | చంద్రబాబు కన్నీరు పెట్టడంపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు!
Mudragada Letter to Chandra Babu | భార్యకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు కన్నీరుపెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందని ముద్రగడ అన్నారు.

Mudragada Letter to Chandra Babu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరికి అవమానం జరిగిందంటూ కన్నీరు పెట్టుకోవడం చూసి ఆశ్చర్య పోయానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాడు 2017లో కాపు ఉద్యమం సమయంలో పోలీసుల మద్దతుతో తమ కుటుంబాన్ని భౌతికంగా, మానసికంగా చేసిన వేధింపులను గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో తన కుటుంబానికి జరిగిన అవమానం మరిచిపోలేదన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ముద్రగడ మంగళవారం రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
చంద్రబాబు కంటే తమ కుటుంబానికి చాలా చరిత్ర
చంద్రబాబు కన్నా తమ కుటుంబానికి చాలా చరిత్ర ఉందని ముద్రగడ గుర్తు చేశారు. తమ తాత పేరుకు కిర్లంపూడి మునసబు గానీ, జిల్లా మునసబుగా వ్యవహరించారని పేర్కొన్నారు. తన తండ్రిని పత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీకి పంపారని తెలిపారు. తాను చంద్రబాబుతో కలిసి తొలిసారి 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టానని గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్.. బాబు పిలుపులతో ఇలా..
తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో 1983లో, అటుపై చంద్రబాబు పిలుపుతో ఆయన వద్ద చాలా ఏండ్లు పని చేశాను గానీ ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని ముద్రగడ పేర్కొన్నారు. కాపులను బీసీల్లో కలపాలని డిమాండ్ చేస్తూ 2017లో పాద యాత్ర చేయడానికి ముద్రగడకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించలేదు. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బాబు పోలీసుల మద్దతుతో తనను వేధించారని ముద్రగడ ఆరోపించారు.
కాపులకిచ్చిన హామీ అమలు చేయాలంటే..
కానీ చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని దీక్ష చేపట్టిన మొదటి రోజే ఆయన పుత్రరత్నం లోకేశ్ పోలీసులకు ఫోన్ చేసి తనను, తన భార్యాపిల్లలను దుర్భాషలాడిన విషయాలు మరిచిపోలేద ముద్రగడ అన్నారు. ఈ పరిణామంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చంద్రబాబు పతనం చూడాలనే ఆ ప్రయత్నం విరమించుకున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
తన కుటుంబ మహిళలను అవమానించారిలా..
తన కొడుకును లాఠీలతో కొట్టించిన సంగతి.. తన భార్యా కోడళ్లను లోకేశ్ దుర్భాషలాడిన సంగతి మరిచిపోయారా? అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్ధలు కొట్టి తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడటం చంద్రబాబుకు గుర్తు లేదా? అని నిలదీశారు. రాజమండ్రి దవాఖానలో తమను 14 రోజులు నిర్బంధించి రాక్షసానందం పొందారని ధ్వజమెత్తారు.
ఆస్తులు.. పదవులు శాశ్వతం కాదని వ్యాఖ్య
ఇప్పుడు చంద్రబాబు నోటి వెంట ముత్యాల వంటి వేదాలు వస్తున్నాయని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఆస్తులు, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబును, ఆయన భార్యను అవమానించడానికి తాను ఈ లేఖ రాయలేదని, గతాన్ని గుర్తు చేయడానికి మాత్రమేనని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tiktok : టిక్టాక్పై బ్యాన్ ఎత్తివేత.. గత 15 నెలల్లో ఇది నాలుగో సారి
OnePlus 9RT : పేరు మార్చుకొని భారత్లో లాంచ్ అవనున్న వన్ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

