AP Weather | ఏపీలో రేపటి నుంచి వర్షాలు.. వాతావరణ కేంద్రం తీపి కబురు
AP Weather | కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగా విస్తరిస్తుండడంతో విశాఖ వాతావరణ శాఖాధికారులు ఆంధ్రప్రదేశ్‌కు తీపి కబురును అందజేశారు.
అమరావతి : కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగా విస్తరిస్తుండడంతో విశాఖ వాతావరణ శాఖాధికారులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు తీపి కబురును అందజేశారు. మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమ(Rayalaseema) లోకి ప్రవేశించి రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని, ఈ వర్షాలు రెండు, మూడు రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో వడగాలులు, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నీ కుదిరితే జూన్ మొదటి వారంలోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తున్నారు
. ఉత్తరకోస్తా(North Costa) లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము (Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించారు.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. గంటకు 30-40 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాయలసీమలో ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడుతాయని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

